Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒలింపియాడ్‌ పరీక్షకు రిజిస్టేషన్‌ ప్రారంభం

ఒలింపియాడ్‌ పరీక్షకు రిజిస్టేషన్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ  – భువనగిరి : జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివద్ధికి, డిజిటల్‌ అక్షరాస్యత అవకాశాలు కల్పించే దిశగా ఒలంపియాడ్‌ పరీక్షకు రిజిస్టేషన్లు సీఎస్‌సీ కేంద్రాలలో చేస్తున్నట్లు సీఎస్‌సీ జిల్లా మేనేజర్‌ బుగ్గ శ్రీధర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  3వ తరగతి నుంచి 10వ తరగతితోపాటు, ఇంటర్‌  విద్యార్థుల్లో సైన్స్, గణితం, ఇంగ్లీష్ సైబర్‌ విషయాల్లో ప్రతిభను గుర్తించి మెరుగుపరచాలనే లక్ష్యంతో రూపొందించబడిందని 6వ ఒలంపియాడ్‌లో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక దష్టి సారించినట్లు తెలిపారు. విద్యార్థులు సీఎస్సీ కేంద్రం లేదా పాఠశాల ఆధారిత సీఎస్సీ కియోస్స్‌ ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారక వెబ్సైట్ను పరిశీలిం చగలరని సూచించారు. ఈ నెల 15వ తేది నుంచి సెప్టెంబర్‌ 30వ తేది వరకు వివరాలను నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు పూర్తి వివరాల కోసం సమీపంలో ఉన్న సీఎస్‌సీ కేంద్రాలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలో పరీక్ష విద్యార్థులకు చేర్పించే వరకు సంప్రదింస్తే రీజిస్టేషన్‌ సమయంలో సీఎస్‌సీ కేంద్రాన్ని పాఠశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఫోన్‌ నెంబర్‌ 7217736013

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -