నిరంతరం పారిశుధ్యం పైనే దృష్టి
కాల్వలు, నీటి గుంతల్లో దోమలు లేకుండా ప్రత్యక ద్రుష్టి
ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ – కాటారం : మండలం లోని రేగులగూడెం గ్రామపంచాయతీ సిబ్బంది అనుదినం ప్రజల సేవకే అంకితం అవుతూ ప్రజల మన్నలు పొందుతున్నారు పారిశుధ్య విషయంలో అయితే ప్రతిరోజు మురికి నీరు రోడ్ల మీద నిల్వకుండా ,ప్రజలు దోమల బారిని పడకుండా నిరంతరం కాలువలను పరిశుభ్రం చేస్తూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగుచర్యలు తీసుకుంటున్నారు. వర్ష కలంలో దోమల విజృంభనకు కారణమైన మురుగును ఇళ్ల మధ్య నిల్వ ఉండకుండా డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నారు . మురుగు నిలిచినా చోట బ్లీచింగ్ పౌడర్ ను చల్లడంతో పాటు దోమల నివారణకు విధిగా పాగింగ్ చేస్తున్నారు . దింతో పంచాయతీ సిబ్బంది పనికి ప్రజలు ఆనందం వ్యకం చేస్తున్నారు .
పరిశుభ్రత దిశగా రేగులగూడెం గ్రామపంచాయతీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES