- Advertisement -
నవతెలంగాణ -మద్నూర్ : మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా రేఖ బాయి బసవరాజ్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రేఖ బాయి దంపతులకు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రేఖబాయి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల అవసరాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



