కింగ్ ఛార్లెస్ సోదరుడు అరెస్టు
లండన్ : ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇంగ్లాండ్‌లో భారీ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ తాజాగా బ్రిటన్ రాజకుటుంబంలోనూ అలజడి కలిగించాయి. అమెరికా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నందుకు యార్క్ మాజీ డ్యూక్, బ్రిటన్ కింగ్ ఛార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్‌బాటన్- విండ్సర్ (గతంలో ప్రిన్స్ ఆండ్రూ)ను గురువారం తెల్లవారుజామున థేమ్స్ వ్యాలీ పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్‌లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం అసాధారణమైన పరిణామం. విండ్సర్‌కు గురువారంతోనే 66 ఏళ్లు నిండాయి. 2001 నుంచి 2011 మధ్యకాలంలో ప్రభుత్వ అధికారిక రహస్య పత్రాలను ఎప్‌స్టీన్‌కు అందచేశారనే ఆరోపణలతో పోలీసులు విండ్సర్‌ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పత్రాలను అందచేశారనే ఆరోపణలతో విండర్స్‌ను అరెస్టు చేసినా, అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోనూ అతని పేరు ఉంది.
జనవరి 30న అమెరికా విడుదల చేసిన ఒక ఫోటోలో ఒక మహిళతో అసభ్య భంగిమలో విండ్సర్ కనిపించారు. దీనికి ముందు.. అంటే 2021లో ఒక అమెరికా మహిళ విండ్సర్‌పై అత్యాచార ఆరోపణలు చేశారు. 17 వయస్సులో తనను ఎప్‌స్టీన్ సెక్స్ కోసం అక్రమంగా విండర్స్‌కు అప్పగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను మాజీ యువరాజు ఖండించినా.. ఆ మహిళతో కోర్టు వెలుపుల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు బయటపడ్డంతో గతేడాది అక్టోబర్‌లోనే అతని బిరుదులు తొలగించారు. అతని అధికారిక నివాసం రాయల్ లాడ్జ్‌ను విడిచిపెట్టమని ఆదేశించారు. ఇటీవలే నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హోమ్ ఎస్టేట్‌లోకి విండ్సర్ మారారు. ఇది కూడా కింగ్ ఛార్లెస్ ప్రైవేటు ఆస్తి. ఇక్కడనుంచే గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విండ్సర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ మీడియా తెలిపింది.
ఎప్‌స్టీన్‌తో సంబంధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



