- Advertisement -
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. ఈనెల 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ప్రేక్షకుల డిమాండ్, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో విడుదలను ఒక రోజు ముందుకు జరపాలనే నిర్ణయాన్ని మేకర్స్ తీసుకున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 18న కర్నూలులో భారీ పబ్లిక్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఇదే తొలిసారిగా జరగనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
- Advertisement -



