‘కలర్ ఫొటో, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 25న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్‌ను పూర్తి చేసుకోవటం విశేషం. నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌లో 200కు పైగా థియేటర్స్‌లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది.
ఓవర్సీస్‌లో అయితే ఈనెల 23నే ప్రీమియర్స్ వేస్తున్నారు. మంచి అంచనాలతో క్రిస్మస్ సందర్బంగా విడుదలవుతున్న ఈ సినిమా నుంచి శుక్రవారం రోజున మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సాంకేతికంగా మనిషి రోజు రోజుకీ ఎంతో ఎదుగుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు మంచి చదువులు చదువుకుని అమెరికాకు వెళ్తున్నారు. ఇంత డెవలప్‌మెంట్ అవుతున్నా.. సమాజాన్ని పట్టి పీడుస్తోన్న అంతర్గత సమస్యల్లో ప్రధానమైనది కులం. అలాంటి ఓ సెన్సిటివ్ విషయాన్ని కమర్షియల్ పంథాలో ఫన్నీగా ట్రైలర్‌లో ఆవిష్కరించారు డైరెక్టర్ మురళీకాంత్. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి అని మేకర్స్ తెలిపారు.
క్రిస్మస్ కానుకగా రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



