రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొం దుతున్న పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు.
ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఏఆర్ రెహమాన్ స్వర పరిచిన చార్ట్‌బస్టర్ సింగిల్ ‘చికిరి చికిరి’ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. అనేక మైలురాళ్లను అధిగమించి, సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. చికిరి పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి, అనేక రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది.
ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్
- Advertisement -
- Advertisement -



