Thursday, April 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలువేసవి కానుకగా విడుదల

వేసవి కానుకగా విడుదల

- Advertisement -

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్‌ కార్పోరేషన్‌, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్‌, బాలాజీ శక్తివేల్‌, దివాకర్‌, అరుళ్‌ దాస్‌, బక్స్‌, వినోదిని, మునిష్‌ కాంత్‌, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది.

విజయ్ ఆంటోనీ, స్వాసిక మాసీ లుక్‌కు అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘ఇది కలనో’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో విజయ్ ఆంటోని, స్వాసిక కనిపిస్తున్న తీరు, వారి ప్రేమను వ్యక్త పరుస్తున్న విధానం ఎంతో చక్కగా ఉంది. ఈ పాటకు భాష్య శ్రీ అందించిన సాహిత్యం, శిభి శ్రీనివాసన్‌, శిరీష భాగవతుల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. బాలాజీ శ్రీరామ్‌ అందించిన బాణీ శ్రోతల్ని ఇట్టే కట్టి పడేసేలా ఉంది. ఈ సినిమాని సమ్మర్‌ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు అని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -