Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeసినిమావినాయక చవితి కానుకగా రిలీజ్‌

వినాయక చవితి కానుకగా రిలీజ్‌

- Advertisement -

నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ బ్యానర్‌పై సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ‘ప్లీజ్‌ మేమ్‌..’ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. ‘శ్రీహర్ష ఇమాని రాసిన లిరిక్స్‌ ఫన్‌ ఫుల్‌గా పాటకి పర్ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాయి. అర్జున్‌ చాందీ, దీపక్‌ బ్లూ, అరవింద్‌ శ్రీనివాస్‌, సాయిశరణ్‌, రేష్మా శ్యామ్‌, హరిప్రియా, లవితా లోబో కలిసి పాడిన ఈ పాట అదిరిపోయింది. అందరి వాయిస్‌ మిక్స్‌తో పాటకి ఎనర్జీ రెట్టింపు అయ్యింది. విశ్వరఘు చేసిన కొరియోగ్రఫీ స్టైలిష్‌గా ఉంది. నారా రోహిత్‌, శ్రీదేవి విజయ్‌ కుమార్‌ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. గణేష్‌ చతుర్థి సందర్భంగా ఈనెల 27న సినిమా విడుదల కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad