Wednesday, September 24, 2025
E-PAPER
Homeసినిమా7వేలకు పైగా థియేటర్లలో రిలీజ్‌

7వేలకు పైగా థియేటర్లలో రిలీజ్‌

- Advertisement -

‘కాంతార: చాప్టర్‌ 1′ సినిమా చిత్రీకరణ సమయంలో నేను నాలుగు సార్లు చనిపోయేవాడిని. ఆ దేవుడి ఆశీస్సులు ఉండటం వల్లే బతికాను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. తమ సొంత సినిమాలా భావించారు. అందుకే సినిమా అద్భుతంగా వచ్చింది’ అని ‘కాంతార: చాప్టర్‌ 1’ ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుకలో హీరో రిషబ్‌ శెట్టి అన్నారు. ‘కాంతార’ సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ట్రైలర్‌ని తెలుగులో హీరో ప్రభాస్‌ లాంచ్‌ చేశారు. అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో స్టార్‌ హీరోలైన హృతిక్‌ రోషన్‌, పథ్వి రాజ్‌ సుకుమారన్‌, శివ కార్తికేయన్‌ లాంచ్‌ చేశారు. విజువల్‌ వండర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తూ ప్రేక్షకులను కాంతారా ప్రపంచంలోకి ట్రైలర్‌ తీసుకెళ్ళి, అనేక రికార్డులు సష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్‌ అన్ని భాషల్లో కలిపి 107 మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌తో పాటు 3.4 మిలియన్‌ లైక్స్‌ సాధించి సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఈ సినిమాలో రిషబ్‌ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్‌ కనిపించనుంది. గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్‌ శెట్టి ఒక దశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్‌ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోస్టల్‌ సర్కిల్‌ భాగస్వామ్యంతో ‘కాంతార’థీమ్‌తో చిత్ర బృందం స్పెషల్‌ కవర్‌ను తీసుకొచ్చింది. ‘స్పిరిట్‌ ఆఫ్‌ కర్ణాటకలో భాగంగా భూతకోల నేపథ్యంలో రెండు పోస్టల్‌ కార్డులను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఆధ్యాత్మికతను, జానపదాన్ని, సంస్కృతిని ఏకం చేస్తుంది. హోంబలే ఫిల్మ్స్‌ సహకారంతో కర్ణాటక పోస్ట్‌ సర్కిల్‌ ఈ కార్డులను విడుదల చేసింది. ‘కాంతార’ ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు తెలియజేస్తుంది. ఈ కథలన్నీ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి’ అని ఇండియా పోస్ట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -