- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గోపన్‌పెళ్లి ప్రయివేట్ భూవివాదం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో ఇదే కేసుపై హైకోర్టులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటపిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఎన్ పెద్దిరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు డిస్మిస్ చేసింది. అలాగే పిటిషనర్‌తో పాటు అడ్వకేట్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ పెద్దిరెజుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తదుపరి విచారణ వచ్చే నెల 11 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
- Advertisement -