మద్దతుగా పలు చర్యలు తీసుకున్న బ్రెజిల్ ప్రభుత్వం
బ్రసీలియా : అమెరికా ప్రభుత్వం విధించిన 50శాతం టారిఫ్‌లతో దెబ్బతిన్న ఎగుమతిదారులకు మద్దతుగా పలు చర్యలను బ్రెజిల్ ప్రభుత్వం చేపట్టింది. సావరిన్ బ్రెజిల్ పేరుతో చేపట్టిన ఈ చొరవ కింద 550కోట్ల డాలర్ల మేరకు రుణాలను అందచేస్తోంది. అలాగే పన్ను చెల్లింపులకు విరామాలు ప్రకటించింది. చిన్న తరహా వ్యాపారాలకు ముఖ్యంగా పాడైపోయే ఆహార పదార్ధాలకు సంబంధించిన వ్యాపారస్తులకు ప్రాధాన్యతనిచ్చింది. టారిఫ్‌లకు ప్రభావితమైన గ్రామీణ, వ్యవసాయ-పారిశ్రామిక రంగాల నుండి ప్రభుత్వ సేకరణలకు వెసులుబాటు కల్పించింది. ఎగుమతి హామీ వ్యవస్థలను ఆధునీకరించింది. ఉత్పత్తి వ్యవస్థలో చెల్లించిన పన్నులను తిరిగి వెనక్కి ఇచ్చే కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. ఈ చొరవలను ప్రకటించే సందర్భంగా అధ్యక్షుడు లూలా డసిల్వా ప్రసంగిస్తూ, బ్రెజిల్ ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనలను తిరస్కరించారు. సంక్షోభం తలెత్తినపుడు తాము భయపడబోమని, ఆందోళన చెందబోమని, ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి బ్రెజిల్ ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టబోదని లూలా చెప్పారు. సంబంధాలను దెబ్బతీసుకునే స్థాయిలో తాము ఎలాంటి చర్యలు చేపట్టాలనుకోవడం లేదని అన్నారు. ఈ టారిఫ్‌లు విధించడానికి ట్రంప్ పేర్కొంటున్న కారణాలను ఆయన తోసిపుచ్చారు. దేశంలో మానవ హక్కులను గౌరవించడం లేదని చేసిన ఆరోపణలను ఎంత మాత్రమూ ఆమోదించలేమన్నారు.
ట్రంప్ టారిఫ్‌లతో దెబ్బతిన్న ఎగుమతిదారులకు ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES