రూ.12 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టిన తర్వాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్-3 క్యాటగిరీ లబ్దిదారులకు సంబంధించిన బిల్లులను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1,072 మంది లబ్దిదారులకు సంబంధించిన రూ.12.17 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసినట్టు హౌజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిని నిర్మించుకుంటున్న లబ్దిదారుల్లో ఎల్-3 క్యాటగిరీలోని వారికి కొద్ది కాలంగా బిల్లులు నిలిచిపోయాయి.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెల్లింపుల ప్రక్రియలో నిశిత పరిశీలనలో లబ్ధిదారులు ఆర్సీసీ అద్దె ఇండ్లలో నివస్తుండటం, గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిపొంది ఉండటం తదితర కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు.ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో సొంతింటి వసతి లేక ఆర్‌సీసీ ఇండ్లలో అద్దెకు ఉంటూ ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్ పనుల వరకే లబ్ధి పొందిన వారికి చెందిన బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్యాటగిరీలో వారికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్రమైన నివేదికలు తెప్పించారు. ఆ నివేదికలను అనుసరించి అర్హులైన 1,072 మందికి బిల్లులను విడుదల చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల ఎల్-3 లబ్దిదారులకు ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



