మతోన్మాదంపై పోరాటమే లక్ష్యంగా
ఈ నెల 19 నుంచి జనవరి 30 వరకు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా సమైక్యత వాదులతో పర్యటన..
జైహో జాతీయ అధ్యక్షులు విజయ శంకర స్వామి..
నవతెలంగాణ – బంజారా హిల్స్
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో నిన్న జరిగిన ఉగ్రదాడిని జైహో జాతీయ సమితి తీవ్రంగా ఖండిస్తోందని ఈ దాడికి పాల్పడ్డ ఉన్మాదులను కఠినంగా శిక్షించాలనీ, ఉగ్రవాదానికి ఈ దేశంలో స్థానంలేదని జైహో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాద్ లో జరిగిన జైహో మూడో జాతీయ సమ్మేళనం గురించి మాట్లాడుతూ… విభిన్న మతాలకు చెందిన వారు, హిందూ ముస్లిం సమైక్యత ప్రతినిధులు, హిందూ మతంలోని విభిన్న స్రవంతులకు చెందిన ప్రతినిధులు, అభ్యుదయ వాదులతో అండమాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, కాశ్మీర్, ఢిల్లీ, తదితర 12 రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరైయ్యారని అన్నారు.
జైహో వ్యవస్థాపకులు విజయవిహారం రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం, విజయవంతమైందని, మతోన్మాద వ్యతిరేక పోరాటంలో ఇది ఓ చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన సమ్మేళనంలో పలువులు ప్రముఖులు పాల్గొని సమైక్యతకు స్ఫూర్తిగా వారి సందేశాలను వినిపించారని, పాల్గొన్నవారిలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి,జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, జైహో జాతీయ ప్రధాన కార్యదర్శి ముస్తాక్ అహ్మద్, ప్రముఖ గాంధేయవాది భూదాన్ సుబ్బారావు, గాంధీ దర్శన్ అధ్యక్షులు సర్వోదయ ప్రసాద్, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (HPE) అధ్యక్షులు సాధు త్రినాథ దాస్, జైభారత్ జాతీయ అధ్యక్షులు సైరాషేఖ్, ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ డా. రఫి, సిక్కు నాయకులు విరాట్ సింగ్ రాథోడ్, శిరిడిసాయి తత్వప్రచారకులు రజనీకుమార్, సోషలిస్టు నాయకుడు రాందాస్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బ్రదర్ షఫి, ఆశ్లీల వ్యతిరేక పోరాట సమితి ఈదర గోపీచంద్, అచలయోగిని డేరంగుల నారాయణమ్మ, ఆధ్యాత్మిక ప్రవచనవేత్త దరూరి నరసింహాచార్యులు,బిర్లామందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు,శివగీత పీఠాధిపతులు సోమేశ్వర స్వామి,అమృతానందగిరి స్వామి, అచలపీఠం రామలింగాచారి, ఆధ్యాత్మిక రచయిత రాజిరెడ్డి, గీతావధాన కళానిధి యడ్లపల్లి మోహనరావు, నవనీతచోర బాలకృష్ణ మఠం బాలకృష్ణమయానంద స్వామి,గీతా ప్రచారకులు జాన్ ఇఫ్రాయిమ్, ‘చినుకు’మూర్తి,బ్రహ్మకుమారీసు నుంచి కుమారి సుజాత,జైభారత్, జైహో జాతీయ,రాష్ట్ర నాయకులు పాల్గొన్నారని అన్నారు.
కాశ్మీర్ నుంచి హాజరైన జైహో జాతీయ ఉపాధ్యక్షులు ఖయ్యుమ్ ఖాన్ మాట్లాడుతూ…మతం వేరు మతోన్మాదం వేరని, మతాలతో సంబంధం లేకుండా మతవేదికలనుండి అన్ని రకాల మతోన్మాదుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మతోన్మాదుల వల్ల మతాలకు అపకీర్తి, మతంలోని మంచి విలువలు మరుగున పడే ప్రమాదం ఉందని అన్నారు. గాంధీ, గఫార్ ఖాన్, వివేకానంద, రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, ఉద్దంసింగ్, అబిద్ హసన్ సఫ్రానీల హిందూ ముస్లిం ఐక్యతా స్ఫూర్తితో.. అన్ని రకాల మతోన్మాదులకు వ్యతిరేకంగా మరింత ఉదృతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సమ్మేళనంలో ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారని అన్నారు.
హిందూ,ముస్లిం,క్రైస్తవ,సిక్కు,జైన,బౌద్ధ తదితర మతాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు మతోన్మాదులకు అడ్డుకట్ట వేసేందుకు, అస్ఫాక్ – బిస్మిల్ అమరత్వానికి, ఐక్యతకి స్ఫూర్తిగా డిసెంబర్ 19 నుంచి జనవరి 30 మధ్య హిందూ-ముస్లిం సమైక్యతా దినాలను జైహో ఆధ్వర్యంలో అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభలు, సమావేశాలు, సమైక్యతా ర్యాలీలు, మానవహారాల కార్యక్రమాలు నిర్వహించాలని సమ్మేళనం తీర్మానించిందని అన్నారు.
జైభారత్ జాతీయ అధ్యక్షురాలు ఖదిజ్ఞాసి సైరా షేక్ మాట్లాడుతూ… హిందూ ముస్లిం సమైక్యత కోసం ‘వేదాంత మేధస్సు – ఇస్లాం శరీరం’ తోనే భారత దేశ భవిష్యత్ నిర్మాణం జరగాలన్న స్వామి వివేకానందుని పిలుపుతో జైభారత్, జైహో ఉద్యమాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోకనాథ్,జాతీయ సమితి సభ్యుల షాజహాన, ఆన్సర్ పటేల్, డేవిడ్ పౌల్, అన్వర్ పటేల్, జైహో జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి మల్లికావల్లభ, జైభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం conc జైభారత్ రాష్ట్ర నాయకులు ఖదిజ్ఞాసి గణేష్ గల్లా, ఖదిజ్ఞాసి శ్రీనివాసులు, ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల తదితరులు పాల్గొన్నారు.


