బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య పరస్పర సంబంధం
మైనారిటీలే లక్ష్యంగా దాడులు : అమెరికా స్వతంత్ర సలహా కమిషన్ నివేదిక
భారతదేశంలో మత స్వేచ్ఛ క్షీణిస్తోందని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, చట్టాలు, విధానాలు కూడా రూపొందు తున్నాయని, ఇటువంటి చర్యల వల్ల వక్ఫ్ బోర్డులు, మదరసాలు వంటి సంస్థలు ప్రభావితమవుతున్నాయని అమెరికా ప్రభుత్వ సలహా సంస్థ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ (అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్) పేర్కొంది. ఈ మేరకు మార్చి 4వ తేదీన ఒక వార్షిక నివేదికను విడుదల చేసింది.
వాషింగ్టన్, న్యూఢిల్లీ : భారతదేశంలో మత స్వేచ్ఛ క్షీణిస్తోందని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, చట్టాలు, విధానాలు కూడా రూపొందుతున్నాయని, ఇటువంటి చర్యల వల్ల వక్ఫ్ బోర్డులు, మదరసాలు వంటి సంస్థలు ప్రభావితమవుతున్నాయని అమెరికా ప్రభుత్వ సలహా సంస్థ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ (అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్) పేర్కొంది. ఈ మేరకు మార్చి 4వ తేదీన ఒక వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్)ను, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)లపై ఆంక్షలు విధించాలని సిఫారసు చేసింది. భారత్‌ను ‘ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం’ (సీపీసీ) గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా భారత్‌కు అందించే వాణిజ్య, భద్రతాపరమైన సహకారాన్ని ఆ దేశంలోని మత స్వేచ్ఛ పరిస్థితులకు ముడి పెట్టాలని కూడా సూచించింది. ఈ కారణంతో అమెరికా చట్టాల కింద జరిగే ఆయుధాల అమ్మకాలను కూడా నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని సిఫారసు చేసింది. భారతదేశంలో మత స్వేచ్ఛ గతేడాది తీవ్రంగా క్షీణించిందని, పరిస్థితులే మాత్రం బాగా లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ కమిషన్ ఇలా భారత్ గురించి సిఫారసు చేయడం వరుసగా ఏడవసారి. అయితే అమెరికా ప్రభుత్వం ఇంతవరకు ఈ కమిషన్ చేసిన ఏ సిఫారసులపైనా చర్యలు తీసుకోలేదు.
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అనేది అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే స్వతంత్ర సలహా కమిటీ. ఇది విధానాలను రూపొందించదు. కానీ అమెరికాకు ముఖ్యంగా విదేశాంగ శాఖకు తీసుకోవాల్సిన చర్యలను మాత్రం సిఫారసు చేస్తుంది. భారత్ గురించి ఈ కమిషన్ ఇలా ఆందోళనలు వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోకూడా చాలాసార్లు ఇలా ఆందోళనలు లేవనెత్తింది.
దేశంలో మత స్వేచ్ఛకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నా వాటిని పట్టించుకోవడం లేదని ఆ నివేదిక పేర్కొంది. న్యూయార్క్‌లో అమెరికా జాతీయుడిపై 2023లో హత్యా యత్నానికి సంబంధించి రా మాజీ అధికారి వికాస్ యాదవ్‌పై ఆంక్షలు విధించాలని కూడా ఈ నివేదిక కోరింది.
పాలక బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య పరస్పర అంతర్గత సంబంధం వుందని, ఈ కారణంగానే మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పౌరసత్వం, మత మార్పిడి, గోవధ చట్టాలు వంటి పలు వివక్షాపూరిత చర్యలు తీసుకోవడానికి, అమలు చేయడానికి వీలు కుదిరిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ను హిందూ జాతీయవాద గ్రూపుగా అభివర్ణించింది. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, పార్శీలు ఇతర మైనారిటీలను బహిష్కరిస్తూ, హిందూ దేశాన్ని నిర్మించడమే ఈ గ్రూపు ప్రాధమిక లక్ష్యమని పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్ నేరుగా రాజకీయ అభ్యర్ధులను బరిలోకి దింపకపోయినా ప్రధాని మోడీ తోసహా పలువురు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లేనని పేర్కొంది. గతేడాది మేలో ఆమోదించిన వక్ఫ్ బిల్లు గురించి నివేదిక ఎత్తి చూపింది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లింయేతరులను నియమించడాన్ని ప్రస్తావించిం ది. భారతీయ పౌరులైనప్పటికీ వందల సంఖ్యలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను అస్సాం నుండి బంగ్లాదేశ్‌కు బహిష్కరించడాన్ని కూడా కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ఇవన్నీ మత స్వేచ్ఛకు ముప్పు కలిగించే అంశాలేనని స్పష్టం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ దేశ ఐక్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ నివేదిక చేసిన సిఫారసులను కాంగ్రెస్ ఎక్స్ పోస్టులో పేర్కొంది.
భారత్ ఖండన
అయితే ఈ సిఫారసులను భారత నిర్దిష్టంగా తోసిపుచ్చుతూనే వస్తోంది. అవన్నీ పక్షపాతంతో చేసే వ్యాఖ్యలని, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తప్ప మరొకటి కాదని భారత ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. తాజా నివేదికపై భారత్ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అమెరికాలో హిందూ దేవాలయాలపై సాగుతున్న విధ్వంసం, దాడులు, అలాగే అమెరికాలోని ప్రవాస భారతీయులపై జరుగుతున్న వేధింపులు, అసహనం వంటి అంశాలపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ దృష్టి సారించాలని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛకు సంబంధించి కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు.
భారత్‌లో క్షీణిస్తున్న మతస్వేచ్ఛ
- Advertisement -
- Advertisement -



