Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత రాజకీయాలు తెలంగాణలో చెల్లవు

మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవు

- Advertisement -

– రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మున్సిపాల్టీలు క్వీన్‌స్విప్‌ చేశాం
– మున్సిపాల్టీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం : మంత్రి ఉత్తమ్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

మతపరంగా ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్దిపొందాలనే వారికి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు చెంప పెట్టులాంటివని, కులమత రాజకీయాలు తెలంగాణలో చెల్లవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సెక్యులర్‌ ఐడియాలజీతోనే అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌ మేయర్‌గా కూరగాయల ఉమారాణి ఎన్నికవ్వడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌తో కలిసి నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. సామాన్య కార్యకర్తకు మేయర్‌ పీఠం కట్టబెట్టడం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని అన్నారు. మున్సిపల్‌ ఫలితాలు కాంగ్రెస్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులకు రెఫరెండంగా భావిస్తున్నట్టు తెలిపారు. పట్టణీకర పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు మున్సిపాల్టీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు గాను ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు. త్వరలోనే ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల పూడికతీత పనులు చేపట్టి నీటినిల్వ సామర్థ్యం పెంచుతామని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ 20, 21కు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ రెండేండ్ల కాలంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులు వివరిస్తూ ప్రజలను ఓట్లడిగామని ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టినా నిజామాబాద్‌ అభివృద్ధి జరగాలని ఓటర్లు భావించి నమ్మి పదవి అప్పగించినట్టు తెలిపారు. అభివృద్ధి కోసమే పదవులని, అందుకే ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ తమతో కలిసి వచ్చాయని అన్నారు. ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు పెట్టుకోలేదని, ఎంఐఎం మీద సైతం పోటీ చేసి 5 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడంతో దాదాపు తాము 7 చోట్ల ఓటమి పాలయ్యామని అన్నారు. బీసీ రిజర్వేషన్‌ లేకున్నా .. సామాన్య కార్యకర్త అయిన బీసీ మహిళకు మేయర్‌ పదవి కట్టబెట్టామన్నారు. అభివృద్ధి నినాదం భవిష్యత్తూలోనూ కొనసాగిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ది అనైతిక పొత్తు : ఎంపీ అరవింద్‌ విమర్శ
అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ బీజేపీకి మేయర్‌ పీఠం దక్కకుండా అన్ని పార్టీలు ఒక్కటైయ్యాయని ఎంపీ అరవింద్‌ అన్నారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ది అనైతిక పొత్తు అని విమర్శించారు. మేయర్‌ ఎన్నిక అనంతరం కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు, కేటీఆర్‌, కేసీఆర్‌పై ఉన్న ఫార్ముల ఈ రేసు కేసు, కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు ముందుకు వెళ్లకుండా తాము ఒక్కటే అని పొత్తులతో నిరూపించుకున్నాయని అన్నారు. కరీంనగర్‌లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని ప్రశ్నించగా.. అక్కడున్న ప్రేమ నిజామాబాద్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -