Monday, February 23, 2026
E-PAPER
Homeకరీంనగర్మిగిలిపోయిన కాలువ పనులు పూర్తి చేయాలి

మిగిలిపోయిన కాలువ పనులు పూర్తి చేయాలి

- Advertisement -

ప్రజావాణిలో సర్పంచ్ల వినతి 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

కాళేశ్వరం పనులలో భాగంగా మిగిలి పోయిన కాలువల పనులు పూర్తి చేయాలని తంగళ్లపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూర్మని రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11/6, 11/5, 11/4 ఈ కాలువల ద్వారా మండలంలోని 11 గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం పనులు మొదలు పెట్టిందన్నారు. వివిధ కారణాల వల్ల ఆ పనులు మద్యలోనే ఆగిపోయాయన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివాసరెడ్డి, సాయిక్రిష్ణ, పర్శరాములు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -