- Advertisement -
నవతెలంగాణ-రాజాపేట
రాజపేట మండలంలో ఐకెపి ద్వారా నిర్వహించబడే మిగిలిన ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభించాలని జెసి వీరారెడ్డి తెలిపారు. మంగళవారం రాజపేట మండలం రఘునాథపురం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న కుప్పలను ఆయన పరిశీలించారు. బుధవారం రోజు రఘునాథపురం కేంద్రం ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలోని బిఎల్ఓ ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడి తగు సూచనలు ఇచ్చారు. బిఎల్వోల అనుమానాలను నివృత్తి చేశారు. తహసిల్దార్ ఇంద్రకర్ అనిత, నాయబ్ తహసిల్దార్ ఉపేందర్, ఏఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఆరైలు రమేష్, నర్సింలు తదితరులున్నారు.
- Advertisement -



