జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వనిత
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్న కేటీఆర్ నీకు 171 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిందని అది గుర్తుంచుకొని మాట్లాడాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అనవసరపు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టియాలని చూస్తున్నారని, ప్రజలు అన్నీ చూస్తున్నానని ఇక మీకు ఎన్నికల్లో పరాజయం తప్పదని ఆమె పేర్కొన్నారు.
ఆది శ్రీనివాస్ నాలుగు సార్లు ఓడిపోయినా ఆయన చరిస్మ ప్రజల్లో తగ్గలేదని అన్నారు. ఆది శ్రీనివాస్ ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని, అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం ఆకాశం పై ఉమ్మివేసినట్లేనని ఆమె పేర్కొన్నారు. వారానికి రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటానని పద్మశాలీలకు చెప్పిన కేటీఆర్ నీవు ఎందుకు ఉండటం లేదని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలపై నీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ఆలోచిస్తున్నారు. నీలాగా చుక్క తెగిపడినట్లు సిరిసిల్లకు వచ్చి వెళ్లడం కాదని ఆమె పేర్కొన్నారు.



