Thursday, December 25, 2025
E-PAPER
Homeసినిమాపేరు ..గుర్తు పెట్టుకోండి

పేరు ..గుర్తు పెట్టుకోండి

- Advertisement -

రష్మిక లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ఫీమేల్‌ -సెంట్రిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ల తర్వాత, తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను ‘రిమింబర్‌ ద నేమ్‌’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. ‘ఈ టీజర్‌లో మైసా పాత్ర డార్క్‌ అండ్‌ ఇంటెన్స్‌ ప్రపంచాన్ని ప్రజెంట్‌ చేసింది. కథానాయిక తల్లి గొంతుతో వచ్చే ‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే పవర్‌ఫుల్‌ వాయిస్‌తో టీజర్‌ మొదలైంది.

ఈ పాత్ర కోసం రష్మిక మందన్న చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత రా అండ్‌ వైలెంట్‌ క్యారెక్టర్‌. టీజర్‌ చివర్లో ఆమె చేసే గర్జన, మైసా పాత్రలో దాగున్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అద్భుతంగా చూపించింది. రవీంద్ర పుల్లే ఈ కథను ఎంతో డెప్త్‌తో, అద్భుతంగా హ్యాండిల్‌ చేశాడు. ముఖ్యంగా, గోండ్‌ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా రష్మిక పాత్రను చూపించిన విధానం అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -