– తీపి జ్ఞాపకాలను నెమరు
– ఆటా… పాటలతో సంస్కృతి కార్యక్రమాలు
– అలరించిన ఆనందలహరి 2025
– ఘనంగా డా పందిరి రవీందర్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం
నవతెలంగాణ మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో ఉన్న కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విద్యార్థుల అపూర్వ విద్యార్థుల ఆనందలహరి 2025 ఆదివారం స్థానిక టీఎన్ఆర్ గార్డెన్లో ఘనంగా జరిగింది. డాక్టర్ పి రవీందర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.1984 నుంచి 2019 వరకు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో వందలాది మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.

మొత్తం నాలుగు బ్యాచులుగా విభజించి అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, స్వామి వివేకానంద నామకరణాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదిక పైకి వచ్చి కలుసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. బ్యాచుల వారిగా విద్యార్థులు విరిపై అలనాటి కళాశాలలో చేసుకున్న చిలిపి చేష్టలు, నాటి తీపి గుర్తులు గుర్తుచేసుకున్నారు. జీవితంలో పడిన కష్టాలు, సంతోషాలు స్నేహితులతో పంచుకున్నారు. కుటుంబసభ్యుల వివరాలు, భావాలు తెలుసుకున్నారు. అనేక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వరకు వినోదంగా గడిపారు. డాక్టర్ పి రవీందర్ ఆయన సతీమణి శ్రీదేవి దంపతులకు ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.



