Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeసినిమామీ కాలేజీ రోజుల్ని గుర్తు చేస్తుంది

మీ కాలేజీ రోజుల్ని గుర్తు చేస్తుంది

- Advertisement -

మౌళి తనుజ్‌, శివానీ నాగరం లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై దర్శకుడు సాయి మార్తాండ్‌ రూపొందించారు. ‘నైన్టీస్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ డైరెక్టర్‌ ఆదిత్య హాసన్‌ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు బన్నీ వాస్‌, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా ఈ నెల 5న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హీరోయిన్‌ శివానీ నాగరం మీడియాతో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
మ్యూజిక్‌ డైరెక్టర్‌ సింజిత్‌ యెర్రమల్లి నా చిన్నప్పటి స్నేహితుడు. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్‌ నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్‌ సాయి మార్తాండ్‌ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ప్రతి క్యారెక్టర్‌ను ఆయన డిజైన్‌ చేసిన తీరు బాగా నచ్చింది. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో లవ్‌ స్టోరీతో పాటు ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇందులో అలా కాదు. ఇది కంప్లీట్‌ లైట్‌ హార్టెడ్‌ మూవీ. కాలేజ్‌ డేస్‌లో ఉండే ఫన్‌తో సాగుతుంది. లవ్‌ స్టోరీ ఉన్నా, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు.
ఇందులో కాత్యాయని అనే క్యారెక్టర్‌లో నటించాను. ఈ క్యారెక్టర్‌ ప్రేక్షకులు తమతో తాము పోల్చుకునేలా ఉంటుంది. అఖిల్‌, కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే మీకు మీ కాలేజ్‌ డేస్‌ గుర్తొస్తాయి. మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది. కాత్యాయని క్యారెక్టర్‌ నా లైఫ్‌లో కూడా రిలేటబుల్‌గా ఉంది. నేనూ కాలేజ్‌లో యావరేజ్‌ స్టూడెంట్‌నే. స్టూడెంట్‌ లైఫ్‌లో మనం చేసిన పనులన్నీ ఇది చూస్తుంటే గుర్తొస్తాయి.
‘ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రాజాగాడికి పాట నా ఫేవరేట్‌ సాంగ్‌. ఫస్ట్‌ నుంచి ఈ మూవీ థియేటర్‌ కోసం చేసిందే. వంశీ నందిపాటి, బన్నీవాస్‌ ఎంటర్‌ అయ్యాక, బిగ్గర్‌ స్కేల్‌ రిలీజ్‌కు తీసుకెళ్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా మా మూవీ బాగా రిలీజ్‌ అవుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad