– ప్రాణం కాపాడిన కోఠి ఈఎన్‌టీ వైద్యులు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఓ వ్యక్తి కంటిలో నుంచి ముక్కులోకి దిగిన కత్తిని హైదరాబాద్ కోఠి ఈఎన్‌టీ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అధునాతన శాస్త్ర చికిత్స ద్వారా తొలగించి అతని ప్రాణం కాపాడారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలే గ్రామంలో ఈనెల 10న రాత్రి 2 గంటలకు గాండు రాజేందర్ ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి అతని కంట్లో కత్తి గుచ్చాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కత్తి కంట్లో నుంచి ముక్కులోకి దిగిందని గుర్తించి ఈనెల 18న కోఠిలోని ఈఎన్‌టీ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు అతన్ని పరీక్షించి 19న ఉదయం 9 గంటలకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహిం చారు. కత్తిని తొలగించి రాజేందర్ ప్రాణం కాపాడారు. అతని పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం రాజేం దర్‌ను సరోజినీ కంటి ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఆపరేషన్‌లో ఈఎన్‌టీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని, అనస్థీషియా డాక్టర్ రవి, వైద్యులు ఉమా, ప్రదీప్, నిఖిల, సౌజన్య, నిహారిక, స్వామి, నర్సింగ్ ఆఫీసర్‌లు అంజలి, టెక్నీషియన్‌లు అమీర్, బాలరాజు, పీజీ వైద్యులు పాల్గొన్నారు.
కంట్లోకి దిగిన కత్తి తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES