Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూమిలోని బోర్డు తొలగింపు 

ప్రభుత్వ భూమిలోని బోర్డు తొలగింపు 

- Advertisement -

నవతెలగాణ – రాయపర్తి 
మండల కేంద్రం శివారులోని 52 సర్వే నెంబర్ లో తమకు భూమి ఉందని మండల కేంద్రానికి చెందిన జెరిపోతుల శివ, జేరిపోతుల వెంకన్న హై కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తీసుకొచ్చారు. ఇట్టి స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన హై కోర్టు(న్యాయ స్థానం) శివకు ఎలాంటి భూమి లేదని, వెంకన్నకు తన తండ్రి పేరుపై ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ 20 గుంటలు ఇస్తున్నట్లు తీర్పునిచ్చి స్టేటస్ కో ఎత్తివేసింది. జర్నలిస్టుల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తి నిర్మాణాలకు అనుమతినిచ్చింది. దాంతో సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆర్ఐ చంద్రమోహన్,  రెవిన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -