- Advertisement -
- కొత్త డీటీఆర్ ఏర్పాటు
- నవతెలంగాణ – రాయికల్
- ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని మంత్యానాయక్ తండాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న డ్యామేజ్ అయిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త పోల్స్‌ను అమర్చారు. అలాగే రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కరెంట్ లోడ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొత్త డీటీఆర్‌ను ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. ఈ చర్యలతో గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం.తిరుపతి,ఒడ్డెలింగాపూర్ ఏఈ రాజేశం,సబ్ ఇంజనీయర్ శ్రీనివాస్, లైన్ మెన్ ఆంజనేయులు,ఏఎల్‌ఎం శ్రీనివాస్,మహేష్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



