నవతెలంగాణ – చారకొండ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తహసీల్దార్ అద్దంకి సునీత అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్యాలయ సిబ్బంది ఓటరు జాబితాను పరిశీలించారు. ఈసందర్భంగా తహసీల్దార్ సునీత మాట్లాడుతూ అచ్చంపేట- కల్వకుర్తి నియోజికవర్గాల్లోని చారకొండ మండలంలో 2002 నుంచి 2025 వరకు ఓటరు జాబితాలో పేర్లు తప్పు ఒప్పులు, మరణించిన వారి పేర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి పేర్లు, పేరు ఒకరిది, ఫోటో ఒకరిది ఉన్న వారిని గుర్తించి ఓటర్ జాబితానుంచి తొలగించడం జరుగుతుందని అన్నారు.
 బీఎల్వీలు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందితో ఓటరు జాబితాను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. బీఎల్వోలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తనిఖీ నిర్వహించిన తరువాత తహసీల్దార్ గారికి నివేదిక ఇచ్చిన తరువాత ఓటరు జాబితాను పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విద్యాధరిరెడ్డి, ఆర్ ఐ భరత్ కుమార్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీను, జూనియర్ అసిస్టెంట్ తరుణ్, గ్రామ పంచాయతీ ఆఫీసర్లు (జీపీవో) రాజు, ఆంజనేయులు, వందనమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
అనర్హుల ఓట్లు తొలగింపు: ఎమ్మార్వో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    