నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పంచాయితీ అధికారులు తొలగిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం బస్టాండ్ ఏరియా, కవ్వాల్ చౌరస్తా, అంగడి బజార్, ధర్మారం చౌరస్తా ప్రాంతాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను పంచాయతీ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో తొలగించారు. అలాగే అన్ని గ్రామాల్లో ఆయా కార్యదర్శిలు పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎవరికి కూడా అక్రమంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తీసేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.
ఎన్నికల కోడ్ తో జన్నారంలో ఫ్లెక్సీల తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES