Friday, September 19, 2025
E-PAPER
Homeకరీంనగర్చెరువు కట్టపై పేరుకుపోయిన గడ్డి, ప్లాస్టిక్ తొలగింపు

చెరువు కట్టపై పేరుకుపోయిన గడ్డి, ప్లాస్టిక్ తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ – జమ్మికుంట
గత రెండు రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, ప్రజలకు అవగాహన, మున్సిపల్ కార్యాలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేయడం, చెత్తను తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. మూడో రోజు శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్  ఆదేశాల మేరకు పట్టణంలోని నాయిని చెరువు కట్టపై ప్లాస్టిక్, గడ్డిని తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి మాట్లాడుతూ.. నేను స్వచ్ఛత వైపు అంటూ నాయిని చెరువు ప్రాంతంలో ప్లాస్టిక్ తొలగించామని, గడ్డిని తొలగించడం జరిగిందని ఆయన అన్నారు ప్రజలు, యువకులు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత వైపు అడుగులు వేసే సమయం ఇది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, శ్రీనివాస్, జునియర్ అకౌంట్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, జూనియర్ అకౌంటెంట్ అనిల్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మహేష్, సదానందం, జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్ తో పాటు బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -