Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ జుక్కల్ వైకుంఠదామంలో ముళ్లపదలు పిచ్చి మొక్కలు తొలగింపు

 జుక్కల్ వైకుంఠదామంలో ముళ్లపదలు పిచ్చి మొక్కలు తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని వైకుంఠధామములో గ్రామ సర్పంచ్ సావిత్రి సాయాగౌడ్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను ముళ్ళ పొదలను బుధవారం నాడు యంత్రాల సాయంతో తొలగించడం జరిగిందని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇటీవలే గ్రామంలో పలువురు మరణించడంతో స్మశాన వాటికకు వెళ్ళిన సందర్భంగా అక్కడ పెరిగిన ముళ్లపదలు పిచ్చి మొక్కలు భారీగా కనిపించాయని అన్నారు. వాటిని చూసిన వెంటనే తొలగించాలని మనసులు అనుకొని నేటి రోజు పనులు ప్రారంభించామని వైకుంఠధామాన్ని పూర్తిగా చెత్తాచెదారం లేకుండా చేయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ , జీపీ కార్యవర్గ సభ్యులు , జిపి కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -