- Advertisement -
నవతెలంగాణ – చండూర్ : చండూరు మున్సిపల్ కేంద్రంలోని ఒకటవ వార్డు పరిధిలో మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న శ్రీరామ కాలనీలో ఇండ్ల మధ్య దారులు మూసుకుని పోయిన కంపచెట్లను బీజేపీ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ జెసిబి సహాయంతో, తన సొంత ఖర్చుతో చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. రెండు చోట్ల వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు విన్నవించినా సమస్యలు పట్టించుకోవడం లేదని, కాలనీ వాసులు వెంటనే సత్యం గౌడ్ కి చెప్పిన వెంటనే శుభ్రం చేయించినట్లు కాలనీ వాసులు తెలిపారు. అనంతరం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -