Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనవాసాల మధ్యలో నుంచి వైన్స్ తొలగించండి

జనవాసాల మధ్యలో నుంచి వైన్స్ తొలగించండి

- Advertisement -

గోపాల్పేట గ్రామస్తుల వినతి..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల వైన్ షాపు జన వాసాల మధ్యల నుండి తొలగించి ఇతర చోట ఏర్పాటు చేయాలని గోపాల్పేట్ గ్రామస్తులు సోమవారం రోజు తాసిల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. వైన్ జనవాసాల మధ్య ఉండటంవల్ల మందు ప్రియులు ఇండ్ల వద్ద మూత్ర విసర్జన చేస్తున్నారని అధికంగా మందు సేవించిన మందు ప్రియులు వైన్స్ దగ్గరే రోడ్డుపైనే పడిపోతున్నారని అటువైపు ఇండ్లకు వెళ్తున్న మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని జనావాసాల మధ్య నుండి వైన్స్ తొలగించాలని తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఫరీద్, సాయిలు, మచ్చేందర్, వినోద్, లక్ష్మీకాంతం, బేస్త సంగయ్య, కృష్ణ, కమ్మరి రవి తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -