Tuesday, December 23, 2025
E-PAPER
Homeజాతీయంకరెన్సీపై గాంధీ ఫొటో తొల‌గింపున‌కు బీజేపీ కుట్ర‌లు: ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌

కరెన్సీపై గాంధీ ఫొటో తొల‌గింపున‌కు బీజేపీ కుట్ర‌లు: ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మోడీ ప్రభుత్వం భారతీయ కరెన్సీ నుండి మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించేందుకు యత్నిస్తోందని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ మండిపడ్డారు. ఈ అంశంపై ప్రాథమిక దశ చర్చలు ఇప్పటికే ముగిశాయని అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సైద్ధాంతిక ప్రాజెక్ట్‌ లక్ష్యం భారత గణతంత్ర సిద్ధాంతాన్ని పునర్నించడమేనని అన్నారు. గాంధీ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు పాత ఆర్ష భారత సంప్రదాయాల్లో (సనాతన ధర్మం వంటివి) పాతుకుపోయిన చిహ్నాల గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. ఈ చర్చలు కేవలం చిహ్నాలకే పరిమితం కాదని, మహాత్మా గాంధీ వారసత్వాన్ని ప్రజా జీవితం నుండి ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు చేపడుతున్న విస్తృత ప్రయత్నంలో భాగమని హెచ్చరించారు. భారతీయ కరెన్సీపై గాంధీ చిత్రాన్ని తొలగింపు చర్చలను దేశ ప్రాజస్వామ్య మరియు రాజ్యాంగవిలువలను పునర్నిర్వచించడానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా చూడాలని అన్నారు.

ఉపాధి హామీ చట్టం స్థానంలో విబి గ్రామ్‌ జి బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా బిజెపి ప్రభుత్వం గాంధీజీని మరోసారి హత్య చేసిందని సిపిఐ(ఎం) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ మండిపడ్డారు. 1948లో మహాత్మాగాంధీ భౌతికంగా హత్యకు గురైనప్పటికీ.. ప్రస్తుత మోడీ ప్రభుత్వం శాసన సంబంధిత చర్యలు, చిహ్నాల మార్పుల ద్వారా సమానత్వం, న్యాయం మరియు అహింస అనే ఆయన సిద్ధాంతాలను కూల్చివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య విలువలను, జాతీయ చిహ్నాలను తుడిచిపెట్టేందుకు చేపడుతున్న చర్యలతో భారతదేశ రాజ్యాంగ వ్యవస్థపై చాలా విస్తృతమైన దాడి వుండవచ్చని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు గణతంత్రం నిర్మితమైన నైతిక మరియు సైద్ధాంతిక పునాదులను బలహీనపరుస్తాయని అన్నారు. జానాభాలో ప్రధాన వర్గం, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలను దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -