Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగిస్తే ప్రళయమే 

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగిస్తే ప్రళయమే 

- Advertisement -

రేపు వరంగల్ లో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి 
ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు వీరేష్ నాయక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగిస్తే రాష్ట్రంలో ప్రళయాన్ని స్పృష్టిస్తామని, లంబాడీల వ్యతిరేక రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పక తప్పదని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గుగులోతు వీరేష్ నాయక్ స్పష్టం చేశారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలకు నిరసనగా నేడు వరంగల్ లో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో అభివాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేష్ నాయక్ మాట్లాడుతూ లంబాడీల, ఆదివాసుల మధ్య చిచ్చు పెట్టేందుకే కొంతమంది ఆదివాసీ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారని తెలిపారు. 10 శాతం ఉన్న గిరిజన తెగలలో ఏడు శాతం గిరిజన లంబాడీలు ఉన్నారని స్పష్టం చేశారు.

కేవలం మూడు శాతం మాత్రమే ఆదివాసీలు ఉన్నారని, రిజర్వేషన్ల నుండి లంబాడీలను తొలగిస్తే మిగిలేది ఆదివాసీలకు మూడు శాతమేనని స్పష్టం చేశారు. ఐక్యమత్యంతో అన్నదమ్ముళ్ల కలిసున్న గిరిజన తెగలను విచ్ఛిన్నం చేసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, మీ చిన్నం చేసే కుట్రలకు గత ఎనిమిది సంవత్సరాల క్రితమే బీజం పడిందని తెలిపారు. గిరిజనుల ఐక్యతకు దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడే తెల్లం వెంకట్రావు ను, సోయం బాబురావుల పై చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించి లంబాడి గిరిజనులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గిరిజన తెగలు ఐక్యమత్యంగా కలిసి వుండి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ జై సింగ్ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు భూక్య శ్రీను నాయక్, నాయకులు గుగులోతు రాజు, గుగులోతు వీరన్న, బానోతు చత్రు నాయక్, బోడ  గోవర్ధన్ నాయక్, గుగులోతు శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ బానోతు మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad