- Advertisement -
మూడు కమిషనరేట్లను నాలుగుగా విభజన
నవతెలంగాణ-హైదరాబాద్
పోలీసు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించారు. మూడు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరిస్తూ నాలుగింటిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ప్యూచర్ సిటీ కమినరేట్లుగా విభజన చేశారు. వీటి పరిధి నుంచి భువనగిరిని మినహాయించారు. మరో వైపు పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ప్యూచర్ సిటీ సీపీగా సుధీర్‌బాబు, మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్ రెడ్డి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంక్ యాదవ్ నియమితులయ్యారు.
- Advertisement -



