నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని బంధాల గ్రామంలో గల ఎర్ర (ఎర్రబాక) చెరువు కట్టకు త్వరగా మరమ్మతులు ప్రారంభించి యుద్ధ ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలని, బంధాల ఆదివాసి రైతులు, సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు. గత రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు బంధాల గ్రామంలోని ఎర్ర చెరువు కట్ట తెగిపోయిందని, ఇరిగేషన్ అధికారులకు ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళామని అన్నారు. 5 లక్షలు మంజూరు కాగా వీటితో పనులు పూర్తి కావని, అధికారులు వచ్చి చూసి పరిశీలించి వెళ్లిపోయారని, మళ్లీ రూ.8 లక్షలు డబ్బులు మంజూరైనట్లు తెలిసిందన్నారు. కానీ ఇప్పటివరకు చెరువు కట్ట మరమ్మతులు చేయడం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. టెండర్ కూడా పూర్తయినట్లు తెలిసింది. అధికారులు, గుత్తేదార్ ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారో తెలియడం లేదని వారు వాపోయారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే కట్ట మరమ్మతులు చేపట్టి పూర్తిచేయాలని ఆదివాసి రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలకు చెరువు నిండి కట్ట తెగిపోవడం వల్ల కట్టకింద ఉన్న 100 ఎకరాల సాగుభూమి కొట్టుకోనిపోయి రాళ్లు రప్పలు ఇసుకతో చేరడంతో, పంటలు పండించుకోవడానికి ఇబ్బందికరంగా నేల మారిందని, మాకు (బంధాల రైతులు,) ప్రభుత్వం సాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి, కలెక్టర్ బంధాల గ్రామంపై దృష్టి పెట్టి ఈ ఏడాది పొలాలు పండడానికి చెరువు కట్ట మరమ్మతులు చేయిస్తారని రైతుల కోరుకుంటున్నారు.
ఈ విషయమై ఐబి డి ఈ సదయను వివరణ కోరగా.. ఈ అయిదారోజులలో పనులు ప్రారంభించి చెరువు కట్ట పూర్తి చేసి, ఆదివాసీ రైతులు పంటలు పండించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES