Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలతో పాటు మరమ్మతులు చేపట్టాలి

వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలతో పాటు మరమ్మతులు చేపట్టాలి

- Advertisement -

వసతి గృహంలో ఉంటున్న బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
గోపాల్పేట మండలం బి. సి బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 
నవతెలంగాణ – వనపర్తి 

జిల్లాలోని వసతి గృహాల్లో ఉంటున్న బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలో ఉన్న బిసి బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను హాస్టల్ వార్డెన్ జీవితను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వసతి గృహంలో వర్షం నీరు చేరి ఇబ్బందులు కలిగాయని వార్డెన్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రహరీ గోడ నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాలని ఆమె కోరారు. స్పందించిన కలెక్టర్ వసతి గృహంలో శిథిలావస్థలో ఉన్న సమస్యలతోపాటు మౌలిక సదుపాయాలు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు భోజనం విషయంలో నాణ్యత పాటించాలని, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత నిరంతరం పాటించాల్సిందిగా ఆదేశించారు. ఎంపీడీవో భావన, ఎమ్మార్వో పాండు, హాస్టల్ వార్డెన్ జీవిత తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad