Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిరసనగండ్ల - అందుగుల రోడ్డుకు మరమ్మతులు

శిరసనగండ్ల – అందుగుల రోడ్డుకు మరమ్మతులు

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండలంలోని శిరసనగండ్ల నుంచి మాడుగుల మండలం అందుగుల గ్రామానికి వెళ్లే మూడు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కళ్ళు సురేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి నరసింహారెడ్డి జెసిబి తో మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రూ. 2 లక్షల, 40 వేలు మంజూరు కావడంతో శిరసనగండ్ల నుంచి అందుగుల వరకు మట్టి రోడ్డుకు మట్టి పోయించి మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన కంప చెట్లను తొలగించినట్లు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో శిరసనగండ్ల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేపడుతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుగుల కృష్ణయ్య, బత్తిని సిద్ధార్థ రెడ్డి, చలపతి రెడ్డి, అందుగుల యాదయ్య, గార్లపాటి రవి, ఎన్నమల్ల చెన్నయ్య, రామస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -