అవినీతి, మతతత్వ హిమంతను ఓడించండి : ఓటర్లకు సీపీఐ(ఎం)అగ్రనాయకురాలు బృందాకరత్ సూచన
భవానీపూర్ :అసోంలో జరగబోయే ఎన్నికల్లో అవినీతి, మతతత్వ, విద్వేషాలతో గెలవాలనకునే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం)అగ్రనేత బృందాకరత్ ఓటర్లకు సూచించారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత హామీలను సునితంగా గమనించాలని కోరారు. అసోంలోని భవానిపూర్-సర్భోగ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న, ప్రతిపక్ష పార్టీల మద్దతు కలిగిన సీపీఐ(ఎం) అభ్యర్థి కామ్రేడ్ మనోరంజన్ తాలూక్దార్‌కు మద్దతుగా బార్పేట రోడ్డు సమీపంలోని గైబాంధా, సరూపేట వద్ద రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటానికి బీజేపీ ఓటర్లను మభ్యపెట్టేలా ప్రచారం చేస్తుందన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మైనార్టీలపై చేస్తున్న దుష్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ హద్దులు దాటి మరీ రెచ్చగొడుతున్న బీజేపీ ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సభల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, అసోం రాష్ట్ర కార్యదర్శి సుప్రకాష్ తాలూక్దార్ హేమెన్ దాస్, అభ్యర్థి మనోరంజన్ తాలూక్దార్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ప్రసంగించారు. ఈ సభలకు భారీ సంఖ్యలో మద్దతుదారులు హాజరయ్యారు.



