రైతుకమిషన్‌కు అందజేసిన నిపుణుల కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో చిన్న నీటిపారుదల రంగం పునర్వ్యస్థీకరణ బలోపేతం కోసం 15 మంది నిపుణులతో వేసిన కమిటీ తన నివేదికను రైతు కమిషన్‌కు శుక్రవారం హైదరాబాద్‌లో అందజేసింది. రాష్ట్రంలో మేజర్, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలను విడదీసి మైనర్ ఇరిగేషన్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రైతు కమిషన్ గతంలో ప్రభుత్వానికి సూచించింది. చెరువుల నిర్వహణ, పునరుద్దరీకరణ కోసం నీటి సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కోరింది.
ఈ నేపథ్యంలోనే రైతు కమిషన్ 15 మంది నిపుణులతో ఒక కమిటీని వేసింది. అందులో రిటైర్డ్ ఐఏఎస్, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు ఉన్నారు. ఈ కమిటీ మూడు నెలలుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి 45 పేజీల నివేదికను రూపొందించింది. ఆ నివేదికను రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, మెంబర్ సెక్రెటరీ గోపాల్‌కు నిపుణుల కమిటీ సభ్యులు జీవీ రమణారెడ్డి కమిషన్ కార్యాలయంలో అందజేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో రైతు కమిషన్ ఇవ్వనుంది.
చిన్న నీటిపారుదల పునర్వ్యస్థీకరణపై నివేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


