Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి

స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి

- Advertisement -
  • – జాతీయ వికలాంగుల హక్కుల వేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు దేవయ్య.
    నవతెలంగాణ -పాపన్నపేట
  •  గ్రామ పంచాయతీలు, మండల , జిల్లా పరిషత్‌లలో నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులను నియమించాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనా వ్యవస్థలో విక‌లాంగుల‌కు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వికలాంగుల అభివృద్ధికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక‌సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌న్నాదం అవుతున్నందున  తక్షణమే నిర్ణయం తీసుకుని స్థానిక సంస్థల్లో నామినేటెడ్ ద్వారా విక‌లాంగుల‌ను  నియమించేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార్స్ చేయాల‌ని ఆయన కోరారు. 
  •  ఈ కార్యక్రమంలో  జిల్లా  ప్రధాన కార్యదర్శి నాసీర్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -