జాతీయ జెండా ఎగురవేసిన పద్మారెడ్డి డిపి
నవతెలంగాణ-అంబర్‌పేట
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబర్‌పేట ప్రాంతంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం అంబర్‌పేట్ నియోజకవర్గం పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దుర్గా నగర్, అంబర్‌పేట ప్రధాన రహదారి, రెడ్ బిల్డింగ్ చౌరస్తా, గంగా బౌలి, ఎరుకల బస్తీలలో జాతీయ జెండాను పద్మావతి డిపి రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ఎంఎస్ రెడ్డి, జమీల్, అవినాష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సోహైల్, హేమంత్, యోబు, స్వామి, శ్రీనివాస్, సురేష్, అనసూయ, స్రవంతి, వాణి, మల్లేశ్వరీ, మీనా, లక్ష్మి, మల్లేశ్వరీ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



