నవతెలంగాణ – నాంపల్లి
77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం నాంపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన నాంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ నక్క చంద్రశేఖర్, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ గుగులోతు దేవా సింగ్, మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో పి వి ఎస్ ఆర్ కె శర్మ, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ మల్లిఖార్జున్ రావు, పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద ఏ డి ఈ సాగర్ రెడ్డి, ఎస్ టి ఓ కార్యాలయంలో ఎస్ టి ఓ ప్రసన్నకుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గందం మోహన్ రావు, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఎం ఏ ఓ శివ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ భవాని సాగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీ ఆర్ ఎస్ నాయకులు నక్క రవీందర్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పానగంటి వెంకటయ్య, బిజెపి ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాచేపల్లి నరసింహ, మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో, అన్ని గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీల నాయకులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



