Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

గ్రామపంచాయతీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

- Advertisement -

గ్రామ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఉష
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పంచాయతీ ఆవరణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేడుకలకు హాజరైన గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామ పెద్దలకు గ్రామస్తుల అందరికీ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి స్వీట్లు పండ్లు ఫలాలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, పంచాయితీ అధికారులు, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -