నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశభక్తికి ప్రతీకగా శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన 50కి పైగా బస్సుల్లో హైదరాబాద్ నలుమూలల నుంచి తరలివచ్చిన 2026 మంది ఎన్‌సీసీ బాలికలు ఏకకాలంలో 2026 జాతీయ పతాకాలను ఆవిష్కరించి రికార్డు సృష్టించారు. వీరితో పాటు ప్రభుత్వ, ప్రయివేటు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరై జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. 50కి పైగా బస్సుల్లో హైదరాబాద్ నలుమూలల నుంచి బాలికలు పాల్గొనగా, మల్లారెడ్డి కళాశాలలకు చెందిన 2 వేల మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు కె.వివేకానంద బాబు గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం తొలిసారి అని తెలిపారు.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



