- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉప్పునుంతల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల కోరిక మేరకు రిక్వెస్ట్ బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఉప్పునుంతల మండల కమిటీ ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. భాను, జే.చరణ్, కె.చరణ్, మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రిక్వెస్ట్ బస్టాప్ అవసరాన్ని వివరించారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఈ బస్టాప్ వల్ల రాకపోకలు సులభతరం అవుతాయని వారు అభిప్రాయపడ్డారు.
- Advertisement -