Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిరుత పులి బారి నుంచి రక్షణ కల్పించాలని వినతి

చిరుత పులి బారి నుంచి రక్షణ కల్పించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని గ్రామాలలో చిరుత పులి నుంచి పశువులకు, ప్రజలకు ముప్పు పొంచి ఉందని ఫారెస్ట్ బీట్ అధికారి రాములుకు డోన్గావ్ సర్పంచ్ కె. శ్రీనివాస్ శనివారం వినతిపత్రం అందించారు. గురువారం రాత్రి రోడ్డుపై యువకులకు చిరుత పులి కనిపించడం కలకలం లేపింది.  ఇలానిత్యం నుండి శక్తి నగర్ గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తూనే ఉంది. గ్రామీణ ప్రజలు బయటికి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతుల వ్యవసాయ భూమిలోకి కూలి పనులకు ఎవరు రావడం లేదు. విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపడం లేదు. గత కొన్ని రోజుల నుండి గ్రామాలలో ఫారెస్ట్ అధికారులు చిరుత పులి తిరుగుతుందని గోడలకు పోస్టర్లు అతికించారు. అదేవిధంగా గ్రామాలలో దండోరా వేయించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు పులిబారి నుంచి రక్షణ కల్పించాలని డోన్గావ్ సర్పంచ్ శ్రీనివాస్ గ్రామస్థులతో కలిసి విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -