Monday, February 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మాహాత్మాగాంధీ పేరు తొలగించొద్దని వినతి

మాహాత్మాగాంధీ పేరు తొలగించొద్దని వినతి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
జాతీయ ఉపాధి హామీ  పథకం నుంచి మాత్మ గాంధీ పేరును తొలగించవద్దని సోమవారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మండల సర్పంచులు ఆధ్వర్యంలో ఎంపీడీవో సాగర్ రెడ్డికి తాసిల్దార్ శివరాజుకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉన్న మాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడం చాలా దారుణమని వారు సూచించారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కందురు సాయినాథ్, మార్కెట్ కమిటీ చేర్మెన్ గొనె కళ్యాణ్, మండల నాయకులు విజయ్ కుమార్, బంక బాబు పురం శెట్టి రవి కుమార్, ఉపాది హామీ ఏపీఓ హరిలాల్, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -