- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఆహార ధాన్యాల నిల్వ కోసం గోదాం మంజూరు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో గోదాం ఏర్పాటుకు స్థలం లేనందున అధికారులు 453 సర్వే నెంబర్ మల్లన్న గుడి ప్రాంతంలో సుమారు రెండు ఎకరాల స్థలం చూపించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



