Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్రెల, మేకల దొంగలను వెంటనే గుర్తించాలని డీసీపీకి వినతి..

గొర్రెల, మేకల దొంగలను వెంటనే గుర్తించాలని డీసీపీకి వినతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలో గొర్రెల మేకల దొంగలను వెంటనే గుర్తించి చట్ట పరిధిలో కఠినంగా శిక్షించి వృత్తిదారులకు నష్ట పరిహారం ఇప్పించాలని భువనగిరి జోన్ డిసిపి ఆకాంక్ష్ యాదవ్ కు గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మద్దెపురం రాజు,దయ్యాల నర్సింహ్మ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో భువనగిరి మండలం రాయిగిరి, బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నీలంబావి, రాయరావుపేట ప్రాంతంలో సుమారు 47 గొర్రెలు,1పొట్టేలు,3 మేకలు దోపిడీకి గురయ్యాయని ఇట్టి విషయాన్ని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారం రోజులు దాటినా ఎటువంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయరావుపేటలో మేకలను ఎత్తుకెళ్ళిన నాలుగు చక్రాల వాహనం వీడియో పుటేజీని బాధితులు పోలీసులకు చూపెట్టినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలలో జీవాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లంల సత్యనారాయణ, గంగదేవి జంగయ్య, ఉడుత నర్సింహ్మ, ఎర్రబోయిన మహేష్, చిన్నాల పెద్ద మల్లేష్, రాసాల మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -