నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో గొర్రెల మేకలకు వెంటనే నట్టల నివారణ మందులను పంపిణీ చేయాలని కోరుతూ జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గతంలో గొర్రెల మేకలకు సంవత్సరానికి నాలుగు సార్లు నటల నివారణ మందులు పంపిణీ చేసేదని , ప్రస్తుతం రెండు సంవత్సరాల నుంచి మందులు పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.
నటన నివారణ మందులు పంపిణీ చేయకపోవడం వలన గోర్లు మేకలలో ఎదుగుదల తగ్గుతుందని, వీటితో పాటుగా అమ్మ తల్లి వ్యాధి కుర్రు వ్యాధి చిటిక వ్యాధి సొల్లు వ్యాధి గాలికుంటు వ్యాధి రోగాలకు పశువుల దవఖానాలలో మందులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వెంటనే స్పందించి నట్టల నివారణ మందులను గొర్ల మేకలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ, సహాయ కార్యదర్శి నారీ వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు గుండమోని ఐలయ్య, క్యాశాని నవీన్, భీమగోని బాలరాజ్, పాక జహంగీర్, దేవి నూరి బాలయ్య, ఎల్లంల వెంకటేష్, గంగాదేవి మల్లేష్, కూకుట్ల రాము, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES